Shardul Thakur was the star performer for Team India in the first innings of the fourth Test match against England at The Oval. While he is better known for his performances with the ball, it was his innings with the bat that saw him score India's second-fastest fifty in the recorded history of Test match cricket.
#IndvsEng2021
#ShardulThakur
#ViratKohli
#BCCI
#JoeRoot
#RavindraJadeja
#KLRahul
#RishabhPant
#Cricket
#TeamIndia
ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ హాఫ్ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. టాపార్డర్ విఫలమైన చోట శార్దూల్ ఇంగ్లిష్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఎడాపెడా బౌండ్రీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వికెట్లు తీస్తున్న ఓలి రాబిన్‌సన్, క్రిస్ వోక్స్‌కు చుక్కలు చూపించాడు. బౌండరీలు, సిక్సులు బాదుతూ వారిని ఒత్తిడిలోకి నెట్టేశాడు. ఈ క్రంమలోనే శార్దూల్ 31 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో భారత్ తరఫున ఇది రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఫిఫ్టీ అనంతరం శార్దూల్ ఔట్ కాగా.. ఆపై భారత్ 191 పరుగులకు ఆలౌట్ అయింది. సూపర్ ఇన్నింగ్స్ ఆడిన శార్దూల్ ఠాకూర్‌పై ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.